- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ కు 2600 మందితో భారీ బందోబస్తు : రాచకొండ సీపీ
దిశ,ఉప్పల్:ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం లో శనివారం జరగబోయే భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ టీ20 మ్యాచ్ కి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. 2600 వందల మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.సీపీ స్టేడియంను ప్రత్యేకంగా అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ట్రాఫిక్ సమస్యలకు ఇబ్బందులు కాకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మ్యాచ్ ముగిసిన అనంతరం ప్రజలు పోలీసులు సూచించిన మార్గాల్లోనే వెళ్లాలన్నారు. ఎవరైనా బ్లాక్ లో టికెట్లు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.300 సీసీ కెమెరాలతో నిఘా పెట్టినట్లు ఆయన చెప్పారు.
మ్యాచ్ మధ్యలో ఎవ్వరూ స్టేడియంలోకి రావద్దని సూచించారు. వాహనాల పార్కింగ్ కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మెట్రో రైళ్ల సమయం అర్ధరాత్రి ఒంటిగంట వరకు పొడిగించినట్టు సీపీ సుధీర్ బాబు పేర్కొన్నారు. క్రికెట్ అభిమానులు స్టేడియంలోకి వెళ్లేటప్పుడు షాక్ లు,లాప్టాప్ లు,బ్యానర్లు,వాటర్ బాటిల్స్,కెమెరాలు, సిగరెట్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, అగ్గిపెట్టే, హెల్మెట్లు సంచులు తీసుకెళ్లడానికి అనుమతి లేదని తెలిపారు.ఈవ్ టీజింగ్ ను నియంత్రించేందుకు మహిళల కోసం ప్రత్యేకంగా షీ టీమ్స్ ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రేక్షకులను సాయంత్రం నాలుగు గంటల నుంచి స్టేడియంలోకి అనుమతిస్తామని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు.