సంక్షేమమే ధ్యేయం
ABN , Publish Date - Sep 25 , 2024 | 12:00 AM
ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని ప్రజాప్రతినిధులు, నాయకులు అన్నారు.
ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని ప్రజాప్రతినిధులు, నాయకులు అన్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ ప్రగతిపై ప్రచారం చేస్తున్నారు.
బలిజిపేట: రాష్ట్రం సంక్షోభంలో ఉన్నా సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కిందని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. నారంనాయుడువలస గ్రామంలో మంగళవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన సూపర్‌సిక్స్ పథకాల అమలుపై ప్రజలకు వివరించారు. అనంతరం ఇది మంచి ప్రభుత్వం, పొలం పిలుస్తోంది పోస్టర్లను ఆవిష్కరించారు. వ్యవసాయశాఖ జేడీ రాబర్ట్‌పాల్, పార్టీ అధ్యక్షుడు వేణుగోపాలనాయుడు, గ్రామ సర్పంచ్ ఎస్.వెంకటరమణ, టీడీపీ అరకు పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షుడు బి.రవికుమార్, గొట్టాపు వెంకటనాయుడు, మండ ల పెదపాపినాయుడు, ఎంపీడీవో విజయలక్ష్మి, క్లస్టర్ ఇన్‌చార్జిలు రాంబాబు, కూట మి నాయకులు పాల్గొన్నారు.
గుమ్మలక్ష్మీపురం: సంక్షేమం, అభివృద్ధే కూటమి ప్రభుత్వం ధ్యేయమని ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు. చినవంకదార గ్రామం లో మంగళవారం నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి వంద రోజుల ప్రభుత్వ పనితీరును వివరించారు. స్టిక్కర్లను అంటించారు. అనంతరం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి డీడీ రావు, ఎంపీడీవో గౌరీశంకరరావు, ఏడీఏ ఆర్.శ్రీనివాసరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు.