Share News

పక్కాగా పశుగణన

ABN , Publish Date - Oct 28 , 2024 | 12:53 AM

దేశంలో పశుసంపదపై సమగ్ర సమాచారాన్ని తెలుసుకునేందుకే కేంద్ర ప్రభుత్వ పశుసంవర్థక శాఖ 21వ పశుగణన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ప్రతి ఐదేళ్లకోసారి దేశంలో పశు సంపదను లెక్కించడం 1919 నుంచి జరుగుతున్నది. చిట్టచివరగా 2018లో 20వ పశుగణన నిర్వహించారు. ఆవులు, ఎద్దులు, గేదెలు, దున్నలు, జడల బర్రెలు, గొర్రెలు, మేకలు, పందులు, ఒంటెలు, గుర్రాలు, గాడిదలు, కుక్కలు, కుందేళ్లు, ఏనుగులు వంటి 15 రకాల పెంపుడు పశువులు/ జంతువులతోపాటు నాటుకోళ్లు, పౌల్ర్టీ కోళ్లు, బాతులు, టర్కీ కోళ్లు, ఈము, నిప్పుకోడి (ఆస్ర్టిచ్‌) తదితర పక్షుల వివరాలను సేకరిస్తారు.

పక్కాగా పశుగణన
ఎలమంచిలిలో పశుగణన సర్వే నిర్వహిస్తున్న సిబ్బంది ఫొటోరైటప్‌:

16 రకాల పశువులు, జంతువుల వివరాలు సేకరణ

కోళ్లతోపాటు పలు రకాల పక్షులు కూడా..

ఈ నెల 25న సర్వే ప్రారంభం

జిల్లాలో 55 మంది సూపర్‌వైజర్లు, 571 మంది ఎన్యూమరేటర్ల నియామకం

ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరణ

అక్కడికక్కడే ఆన్‌లైన్‌లో ప్రత్యేక యాప్‌లో నమోదు

వచ్చే ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన ముగింపు

కోటవురట్ల, అక్టోబర్‌ 27 (ఆంధ్రజ్యోతి): దేశంలో పశుసంపదపై సమగ్ర సమాచారాన్ని తెలుసుకునేందుకే కేంద్ర ప్రభుత్వ పశుసంవర్థక శాఖ 21వ పశుగణన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ప్రతి ఐదేళ్లకోసారి దేశంలో పశు సంపదను లెక్కించడం 1919 నుంచి జరుగుతున్నది. చిట్టచివరగా 2018లో 20వ పశుగణన నిర్వహించారు. ఆవులు, ఎద్దులు, గేదెలు, దున్నలు, జడల బర్రెలు, గొర్రెలు, మేకలు, పందులు, ఒంటెలు, గుర్రాలు, గాడిదలు, కుక్కలు, కుందేళ్లు, ఏనుగులు వంటి 15 రకాల పెంపుడు పశువులు/ జంతువులతోపాటు నాటుకోళ్లు, పౌల్ర్టీ కోళ్లు, బాతులు, టర్కీ కోళ్లు, ఈము, నిప్పుకోడి (ఆస్ర్టిచ్‌) తదితర పక్షుల వివరాలను సేకరిస్తారు. ఈ ఏడాది అక్టోబరు 25వ తేదీన పశుగణను ప్రారంభించి వచ్చే ఏడాది ఫిబ్రవరి 28వ తేదీతో ముగిస్తారు. ఇందుకోసం జిల్లా పశుసంవర్థక శాఖ అధికారులు వెటర్నరీ, పారావెటర్నరీ సిబ్బందిని ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లుగా నియమించారు. వీరు ప్రతి ఇంటికి వెళ్లి ఆయా జంతువులు, పక్షుల వివరాలతోపాటు పెంపకందారుల సమాచారాన్ని కూడా సేకరించి అక్కడికక్కడే ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక యాప్‌ను రూపొందించారు. కేంద్ర ప్రభుత్వ పశుసంవర్థక శాఖ ఆదేశాల మేరకు అనకాపల్లి జిల్లాలో పశుగణన ప్రక్రియను ఈ నెల 25వ తేదీన ప్రారంభించారు. వాస్తవంగా సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి పశుగణను ప్రారంభించాల్సి వుంది. అయితే అనివార్య కారణాల వల్ల అక్టోబరు 25వ తేదీకి వాయిదా పడింది.

జిల్లాలో పశుపోషణపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా 2.34 లక్షల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. వ్యవసాయం భారంగా మారడంతో పలువురు రైతులు పంటల సాగుకు స్వస్తిచెప్పి, పాడి పశువుల పోషణ వైపు మళ్లుతున్నారు. ఈ క్రమంలో పశువుల పెంపకందారులను ప్రోత్సహించేందుకు, భవిష్యత్తులో వారి ఆదాయాన్ని పెంచేందుకు, రుణాల మంజూరు, ఇతర పథకాల అమలు కోసం ప్రస్తుతం జరుగుతున్న పశుగణన ఎంతో దోహదపడుతుందని జిల్లా పశుసంవర్థక శాఖ అధికారులు చెబుతున్నారు. పశుగణన చేపట్టేందుకు జిల్లాలో 55 మంది సూపర్‌వైజర్లు, 571 మంది ఎన్యూమరేటర్లను నియమించారు. వీరు ప్రతి ఇంటికి వెళ్లి ఆయా పశువులు, జంతువులు, పక్షుల వివరాలు సేకరిస్తారు. ఇద్దరు సంయుక్త సంచాలకులు నిరంతరం పర్యవేక్షిస్తుంటారు.

జిల్లాలో 33.66 లక్షలు..!

జిల్లాలో 2018లో జరిగిన పశుగణన వివరాల ప్రకారం ఆవులు 1.85 లక్షలు, గేదెలు 2..5 లక్షలు, గొర్రెలు 1.61 లక్షలు మేకలు, 1.81 లక్షలు పందులు నాలుగు వేలు వున్నాయి. ప్రస్తుతం అన్ని రకాల పశువులు, జీవాలు, కోళ్లు కలిపి సుమారు 33.66 లక్షల వరకు వుంటాయని పశుసంవర్థక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

పోటోరైటఫ్‌:

పెట్ల నరేశ్‌, పశుసంవర్థక శాఖ ఏడీ, కోటవురట్ల (27కేయుటి2)

పశుగణన సర్వేకు సహకరించాలి

పశుగణన సర్వే పక్కాగా సాగాలంటే ప్రజలు అన్ని విధాలా సహకరించాలి. గ్రామాలే కాకుండా పట్టణాలు, నగరాల్లో కూడా ఈ సర్వే జరుగుతుంది. వ్యక్తిగత నివాసాల్లో వుండే వారి నుంచి సమాచారం సేకరించడంలో పెద్దగా ఇబ్బంది వుండదు. అపార్టుమెంట్లలో వుండే వారు పశుగణన సిబ్బంది వచ్చినప్పుడు వారికి సహకరించి పూర్తి సమాచారం ఇవ్వాల్సి వుంటుంది.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Updated Date - Oct 28 , 2024 | 12:53 AM